అది "౨౦౦౨" ఆగష్టు మాసము , ఒకానొక రోజు మధ్యాహ్నం సరిగ్గా పదకొండు గంటల యాబై అయిదు నిముషాలు కి వారపు రైలు (వీక్లీ ట్రైన్ )(ట్రైన్ పేరు మరచిపోయాను ) ఎటువంటి హాహాకారాలు లేకుండా వచ్చి ఒంగోలు రైల్ నిలయమునకు వచ్చి నిలిచెను .ఎప్పటి లాగానే ప్రత్యెక (స్పెషల్) ట్రైన్ కి విశాఖ వచ్చే అలవాటు వున్నా బుజ్జి గాడు ,అలవాటు కొద్ది పరుగెత్తి (అంత అవసరం లేదు అనుకుంట ) రైల్ కిటికీ లో నుండి స్థానము కొరకు చేతి రుమాలు ను విసిరినాడు (రైల్ ఎప్పుడు కాలీనే ఎందుకో అంత తొందర) .
బుజ్జి గాడి కి కాగితము చదువు అలవాటు వుంది కదా ,ఆ రోజు కూడా రెండు పత్రికలూ కొని (మాములు రోజుల లో కొనడు లే ) ఒకటి లేదా రెండు గంటలు అల అలా కాగితమును తిప్పి చూసి తరువాత తనకి దొరకిన స్థానము లో విశ్రాంతి కి వుపక్రమించెను. కొద్ది సమయము తరువాత ఎవరైనా ముఖ పరచయము వున్నవారు (అమ్మాయలు అనుకుంట ) వున్నారేమో అని రైల్ పెట్టె అంత యు తిరుగు చున్నాడు .అప్పుడు అక్కడ ఒక "సూపర్ హిట్ " పత్రిక కనిపించింది ,పక్కన ఇద్దరు అమ్మాయలు ఇద్దరు అబ్బాయలు. బుజ్జిగాడికి కాగితం పిచ్చి కదా (అమ్మాయి కోసం కాదా ! ),ఆ పత్రిక కోసం అక్కడ వాలినాడు (తుమ్మెదలు వలె )
బుజ్జిగాడు కి ఎవరిని కాగితం కోసం అడగటం ఇష్టము వుండదు ,పక్కన వున్న"సూపర్ హిట్ "పత్రిక తీసుకిని బొమ్మలు చూస్తున్నాడు ,అప్పుడు పక్కన వున్న వాళ్ల లో ఒకడు తెలుగు లో "వీడు ఏమిటి తెలుగు పేపర్లు చూస్తున్నాడు " అని అన్నాడు దానికి మన బుజ్జి గాడు ఒక వెకిలి నవ్వు నవ్వ గా అక్కడ వున్న ఒక అమ్మాయి "ఏమోలే కనీసం బొమ్మలు చుస్తాడేమో చూడ నివ్వు అని అన్నది " అన్ని కాగితములలో బొమ్మలు బాగా చూసి ఆ పత్రికని అక్కడ పెట్టి వెళ్లి రైల్ పెట్టె ముఖ ద్వారంలో నిలబడెను బుజ్జిగాడు . ఒకడు వచ్చి బుజ్జిగాడి పక్కన నిలబడెను అక్కడ వాకిలి లో , అప్పుడు బుజ్జి గాడు పక్కన వాడిని సమయము ఎంత అవుతుంది అని తనకి తెలిసిన తెలుగు లో అడిగినాడు .వాడు "మీరు తెలుగు వారా " మేము మిమ్మల్ని హిందీ వాళ్ళు అనుకున్నాము ఇందాక మీరు సూపర్ హిట్ పత్రిక చదువుతుంటే అని అన్నాడు
(చెన్నై తరువాత ఆ రైల్ ఒంగోలు లో ఆగుతుంది ,అందరమూ ఒంగోలు లోనే రైల్ ఎక్కి నాము )
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment